కన్యత్వం కోల్పోతే తప్పేంటి…? వర్జినిటీపై యషిక ఏమంది?

కన్యత్వం కోల్పోతే తప్పేంటి…? వర్జినిటీపై యషిక ఏమంది?

చెన్నై, మే 17 :

ఈ మధ్యలో తమిళనాటకంలో ఓ సినిమాతో హిట్టయిన హీరోయిన్ యషిక కన్యత్వంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ‘కన్యత్వాన్ని కోల్పోతే తప్పేంటి? అంటూ వ్యాఖ్యానించి సామాజిక మాధ్యమంలో దుమారం రేపింది. ఇంతకీ ఆ అమ్మడు ఏమన్నారు? ఎందుకు అలా అన్నారు? చూద్దాం.

ఇటీవల తమిళంలో విడుదలైన ‘ IAMK ‘ అనే అడల్ట్ మూవీ హిట్ అయ్యింది. ఈ సినిమా విభిన్న తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ దెయ్యం ఎక్కడా శృంగారంలో పాలుపంచుకోని యువకుడి కోసం పరితపిస్తుంటుంది.

ఇదో హర్రర్, సెక్సు మూవీ. ఈ సినిమాలో యషిక హీరోయిన్‌గా చేశారు. ఆమె ఈ మధ్య ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె ఓ ప్రశ్నకు బదులిస్తూ, ‘కన్యత్వం కోల్పోవడమా.. ఇందులో వింతేముంది? అదేమన్నా తప్పా ఏంటి? పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటారు వర్జినిటీని కోల్పోతారు.. అలాగే అమ్మాయిలు కూడా వర్జినిటీని కోల్పోతారు. తప్పేముంది? నాకైతే అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించింది. అంతటితో ఆగలేదు.

వర్జినిటీ కోల్పోవడంలో ఆడ, మగ అని తేడా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది.. వర్జినిటీపై సందేహాలు అవసరం లేదంటూ’ చాలా కాజువల్ గా ఓ కామెంట్ పడేసింది. ఏం పెళ్లికి ముందు అబ్బాయిలు వర్జినిటీ కోల్పోవడం లేదా?

మరి అమ్మాయిల కోల్పోతే తప్పేంటి? ఈ విషయంలోనే ఎందుకు తేడా? వారికో న్యాయం, వీరికో న్యాయమా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక మన సామాజిక మాద్యమ నిపుణులు మిన్నకుంటారా? ఈ వ్యాఖ్యలపై విభిన్న కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

మామాట : సినిమాతో ఏమోగాని, వివాదస్పద వ్యాఖ్యలు పేరు తెచ్చి పెట్టాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *