బుక్ రాస్తా… రాజేంద్రప్రసాద్

బుక్ రాస్తా… రాజేంద్రప్రసాద్

హైదరాబాద్, జూలై 12,  సీనియర్ నటుడు  రాజేంద్రప్రసాద్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  “ఎన్టీఆర్ నుంచి మొదలు పెట్టి విజయ్ దేవరకొండ వరకూ అంటే .. ఐదారు తరాల హీరోలతో ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ అనుభవాలకు పుస్తక రూపంగా తెస్తే బాగుంటుంది కదా?” అనే ప్రశ్న నన్ను ఇటీవల పలువురు అడుగుతున్నారు.  అయితే  “ఇంతమంది ఆర్టిస్టులతో ఇన్ని రకాల పాత్రలను చేసే అదృష్టం బహుశా నాకు ఒక్కడికే దక్కిందని అనుకుంటున్నాను. వాళ్లంతా కూడా నా సీనియర్స్ కి సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ వుంటారు.  సినిమా షూటింగు విరామ సమయంలో నా అనుభవాలను నా సహ నటులందరికీ చెబుతూ వుంటాను. నా అనుభవాల్లో ఏ ఒక్కటి వాళ్లకి పనికొచ్చినా నాకు సంతోషమేనన్నారు. ఇంకా  అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ నా అనుభవాలను  తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. నా అనుభవాలను పుస్తక రూపం తీసుకొస్తే బాగుంటుందనే మిత్రుల సూచనను   నేను స్వీకరిస్తున్నాను. రాయడం నాకు అలవాటు లేదు కాబట్టి .. ఎవరినైనా నియమించుకుని ఆ పనిని పూర్తి చేస్తాను” అని చెప్పుకొచ్చారు.

మామాట: అంటే మరిపుడు మీరు కూడా జీవిత చరిత్ర అదీ రాస్తారా… క్ష్మీపార్వతికి కుదురుతుందేమో కనుక్కుందాం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *