ప్రేమ, భావోద్వేగాల మధ్య ‘నా నువ్వే’ ట్రైలర్…

ప్రేమ, భావోద్వేగాల మధ్య ‘నా నువ్వే’ ట్రైలర్…

హైదరాబాద్:

నందమూరి కల్యాణ్ రామ్, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ప్రేమ కథ ‘నా నువ్వే’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యింది.

కల్యాణ్ రామ్ ఇప్పటి వరకూ కనిపించని విధంగా సరికొత్త క్లాస్ లుక్‌తో కనిపిస్తూ కనువిందు చేయగా.., రేడియో జాకీగా తమన్నా మరింత అందంగా కనిపించింది.

తమన్నా ప్రేమతో మొదలైన ట్రైలర్, ప్రేమ విలువ తెలుసుకుని ప్రేమ కోసం వెనక్కి వచ్చిన కల్యాణ్ రామ్ సన్నివేశాలతో ట్రైలర్ ముగిసింది. ఈ ప్రేమ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

మధ్యలో తన బాధని వ్యక్తం చేస్తూ “నా ప్రేమ, నా బాధ అందరికి వినపడుతుంది, నీకు వినిపించడం లేదా??” అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ అందరి మనసునీ హత్తుకుంది.

ఒక పక్క ప్రేమని, ఎమోషన్‌ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, ప్రేమ కోసం తమన్నా పడే తపనని చక్కగా దర్శకుడు జయేంద్ర చూపించాడు.

మహేశ్ కోనేరు సమర్పిస్తున్న ఈ చిత్రం విడుదల చెయ్యడానికి మే 25న ముహూర్తం ఖరారు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కల్యాణ్, తమన్నా ఇద్దరూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఈ సినిమా విజయం ఇద్దరికీ అవసరమే అని చెప్పాలి.

మామాట: ఈ ప్రేమకథ రుచి ఎలా ఉండబోతోందో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *