నా ఓటు సెక్షన్ 377 కే… మహికా

నా ఓటు సెక్షన్ 377 కే… మహికా

ముంబై, జూలై 12, ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న 377 సెక్ష‌న్‌ను ర‌ద్దు చేసి స్వ‌లింగ సంప‌ర్కానికి ఆమోదం క‌ల్పించాల‌ని జ‌రుగుతున్న ప్ర‌య‌త్నానికి మ‌ద్ద‌తు ప‌లుకుతూ హీరోయిన్ మ‌హికా శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. త్వ‌ర‌లో బాలీవుడ్ అరంగేట్రం చేయ‌బోతున్న ఈ మోడ‌ల్ సినీ ప్ర‌ముఖుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌స్తుతం దేశంలో వినోద రంగాన్ని శాసిస్తున్నచాలామంది సూప‌ర్‌స్టార్లు స్వ‌లింగ సంప‌ర్కులేన‌ని మ‌హిక‌ వెల్ల‌డించింది. కొంత‌మంది సూప‌ర్‌స్టార్లు అప్పుడ‌ప్పుడు ఈ త‌ర‌హా శృంగారానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని తెలిపింది. `ఈ దేశంలో అత్యాచారాల‌కు పాల్ప‌డేవారికి, హంతకుల‌కు కూడా కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. కానీ, స్వ‌లింగ సంప‌ర్కుల‌కు మాత్రం లేదు. నిజానికి వారు చాలా మంచివారు. వారిలోనే సృజ‌నాత్మ‌కత ఎక్కువ‌గా ఉంటుంది. నాకు స్వ‌లింగ సంప‌ర్కులైన స్నేహితులు ఉన్నారు. ముంబైలో ఉన్న సినీ న‌టులు, సూప‌ర్ స్టార్లు హోమో సెక్స్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అందులో త‌ప్పేం లేదు. స్వ‌లింగ సంప‌ర్కుల‌కు కూడా స్వేచ్ఛ ల‌భించేలా, వారినీ స‌మాజం ఆమోదించేలా కృషిచేయాల‌`ని మ‌హిక అభిప్రాయ‌ప‌డింది.

మామాట : అంతే నమ్మా… అన్నీ వేదాల్లోనే ఉన్నాయన్నారుగా… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *