అన్న సినిమాకి తమ్ముడి క్లాప్…

అన్న సినిమాకి తమ్ముడి క్లాప్…

హైదరాబాద్, 25 ఏప్రిల్:

ఎం‌ఎల్‌ఏ సినిమాతో ఫ్రేక్షకుల్ని అలరించిన నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రం బుధవారం ఉదయం ప్రారంభమయ్యింది. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.

NTR and NKR at NKR16 movie launchఅన్ని లాంఛనాల మధ్య ప్రారంభం అయిన ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలకి ఆయన తండ్రి హరికృష్ణ, బాబాయ్ నంద‌మూరి రామ‌కృష్ణ‌, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్  ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 16వ చిత్రం కాగా, దీనికి శేఖ‌ర్ చంద్ర సంగీత బాణీలు కడుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 2వ చిత్రం ఇదే.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో నివేథా థామస్‌తో పాటు, అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే హీరోయిన్లుగా నటించనున్నారు..

తాజా సమాచారం ప్రకారం గుణ ఈ సినిమా కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి థ్రిల్లర్ జోనర్లో కళ్యాణ్ రామ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

దీనినిబట్టి చూస్తే కళ్యాణ్ రామ్ రొటీన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ప్రయోగాత్మక సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం హైదరాబాద్, వికారాబాద్‌లో జరగనుంది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్లో తెరకెక్కుతోన్న సినిమాని ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారు.

మామాట: ఈ చిత్రమైనా కల్యాణ్ రామ్‌కి కలిసొస్తుందో లేదో…

English summary:

Nandamuri kalyan ram new film was launched today. Nandamuri hari Krishna and Nandamuri Rama Krishna and Jr NTR attended to this event as chief guests. Jr NTR clapped for this movie. Nivetha Thomas and Shalini pande are going to pair up with kalyan ram.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *